పామూరు మండలం కంబాలదిన్నె సమీపంలో ఆదివారం మోపాడు రిజర్వాయర్ కాలువలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కంబాలదిన్నె గ్రామానికి చెందినవారు గేదెలకు గడ్డి కోసం గ్రామ శివారులో ఉన్న పొలం లో గడ్డి కోసుకుని డాక్టర్ల వేసుకొని తిరిగి వస్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాల పాలైన వారిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక వివరాలు తెలియవలసి ఉంది.