పేరేచర్ల కు చెందిన బాలికపై అత్యాచారం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో 13 మంది నిందితులను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోవిడ్ చికిత్స చేయిస్తామని బాలికను తీసుకెళ్లి పలుప్రాంతాల్లో బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 66 మందిని అరెస్టు చేశారు. రెండురోజుల్లో పోలీసులు అధికారికంగా అరెస్టు చూపించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa