వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చిట్వేలి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన చిట్వేలు లో ద్విచక్ర వాహనాలను, ఆటోలను ఆపి వారి వద్దనున్న వాహనాల పర్మిట్లు, లైసెన్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.