రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన రామ రాజ్యం తలపిస్తోందని డిప్యూటీ సీఎం రాజన్నదొర పేర్కొన్నారు విశాఖ ఎయిర్ పోర్ట్ లో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు వివిధ అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి కాలుష్య ప్రభావిత గ్రామాల విషయంపై చర్చించారు. ముఖ్యమంత్రి విశాఖ ఎయిర్ పోర్ట్ లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు. ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.
విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర నెడ్క్యాప్ చైర్మన్ కే కే రాజు. సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొందరు ఫార్మా కాలుష్య ప్రభావాన్ని సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. కాలుష్య ప్రభావిత తాడి గ్రామాన్ని తరలిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారనీ ఎంపీ డాక్టర్ సత్యవతి తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల తో పాటు అభివృద్ధి అంశాలను నాయకులతో కాసేపు చర్చించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాలకొండ ఎమ్మెల్యే కళావతి తదితరులు సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు.
గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తో పాటు అభివృద్ధికి బాటలు వేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ గిరిజనులు కృతజ్ఞతగా ఉంటారని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కొన్ని మీడియా సంస్థలు అభివృద్ధి పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం రాజన్న దొర మండిపడ్డారు. ఇదే తీరున వ్యవహరిస్తే ప్రతిపక్షాలు మీడియా సంస్థలు ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని అన్నారు. దేశంలోనే అత్యధిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెన్షన్ లు అందిస్తున్న రాష్ట్ర కేవలం ఆంధ్ర ప్రదేశ్ అని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు.