తెలుగు చలనచిత్ర మండలి అధ్యక్షులు నారాయణ్ కె. దాస్ నారంగ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నారంగ్ మృతి పట్ల కొడాలి నాని, వల్లభనేని వంశీ బాధను వ్యక్తం చేశారు. నారంగ్ నైజాం ఎగ్జిబిటర్ గా, పంపిణీదారుడిగా విశేషమైన సేవలు అందించారని కొడాలి నాని చెప్పారు. వారి మరణం విచారకరమని చెప్పారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. వల్లభనేని వంశీ స్పందిస్తూ నారంగ్ చనిపోయారనే వార్త తనను వ్యక్తిగతంగా చాలా బాధించిందని చెప్పారు. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన దూరమవడం దురదృష్టకరమని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.