శ్రీశైల దేవస్థానం నూతన పాలక మండలి మొట్టమొదటి బోర్డు సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు. గత నెల 25వ తేదీన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లా నగరికి చెందిన చక్రపాణిరెడ్డిని దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు దేవస్థానంలోని సమీక్షా సమావేశ మందిరంలో ట్రస్టుబోర్డు సభ్యుల సమావేశం ప్రారంభం కానుంది.