పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్ర రెడ్డి అన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకం అమ్మకం నిషేధం అని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు అమ్మిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం క్రింద కేసులు నమోదు చేస్తామన్నారు. స్వచ్ఛ నరసరావుపేటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.