కోడుమూరు మండలంలోని పులకుర్తి గ్రామానికి చెందిన చిన్న హసన్, షబీమా దంపతుల కుమార్తె షమీనా (18) మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకి పాల్పడింది. ఇంటి పని చేసే విషయంలో తల్లి మందలించడంతో ఆ యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
కూలి పనులు చేసుకునే జీవించే తల్లిదండ్రులు కుమార్తె ఆత్మహత్యతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కోడుమూరు ఎస్సై విష్ణు నారాయణ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.