గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే కోడూరు లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీని దొంగిలించినట్లు ఆలయ స్థాపకుడు, ఆలయ కమిటీ చైర్మన్ బండాత్మకూరు సుదర్శన శర్మ పోలీసులకు తెలిపారు. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోని హుండీని దొంగిలించినట్లు రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలో దాదాపు 25 వేల రూపాయల వరకు ఉండవచ్చని సుదర్శన శర్మ పోలీసులకు తెలిపారు. హుండీ కాకుండా మరే వస్తువులు ఆలయంలో దొంగలు దొంగిలించలేదని ఆయన ఫిర్యాదులో తెలిపారు. రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.