రాష్ట్రంలో పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరాల మేరకు ఏర్పాటైన 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్‌చార్జ్ మంత్రులను నియమించింది. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాల అమలుపై సమీక్షలు, పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాల్లో ఈ నెల 4 నుంచి పరిపాలనను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.