తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుదు నారాచంద్రబాబు నాయుడు పుట్టినరోజు ను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం టిడిపి నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి నాయకులు పంచిపెట్టారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ తమ నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా టిడిపి బీసీ సెల్ నగర అధ్యక్షుడు శంకర్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కాజురు బాలాజీ, చిత్తూరు నగర అధ్యక్షులు కటారి హేమలత పలువురు నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa