గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య గురైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ లో కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్న హనుమంతరావు ,ఆంజనేయులు ఇద్దరూ స్నేహితులు.. కాగా వీరు మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో హనుమంతరావు ఆంజనేయులు పై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆంజనేయులును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని దృవీకరిచిన డాక్టర్లు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.