మహిళల్లో క్యాన్సర్ నిర్ధారణకు స్విమ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పింక్ బస్సు సేవలు అమోఘమని పాకాల మండల జడ్పీటీసీ పద్మజారెడ్డి తెలిపారు. పాకాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మహిళలకు క్యాన్సర్ పరీక్షలు చేశారు. 40 ఏళ్లు దాటిన మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ , నోటి క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ వస్తాయని తెలిపారు. వాటికి స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచితంగా పరీక్షలు చేయడం అభినందనీయమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa