ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం.. ఇద్దరిపై వేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 01:36 PM

ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణికుల నుంచి కారు స్వాధీనం చేసుకున్న ఘటనపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు దీనికి కారణమైన హోంగార్డు పి.తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ ఎ.సంధ్యను సస్పెండ్ చేశారు.


పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్‌ తన కుటుంబంతో కలిసి తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్‌ సెంటరులో కారును ఆపారు. టిఫిన్‌ చేస్తుండగా ఓ కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చి ఈ నెల 22న సీఎం ఒంగోలు పర్యటన నేపథ్యంలో కాన్వాయ్‌ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. కారుతో పాటు డ్రైవర్‌ను తీసుకుని ఆ కానిస్టేబుల్‌ వెళ్లిపోయాడు. ఈ విషయం సంచలనంగా మారడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa