పెద్దమండ్యం మండలం పాపేపల్లి పంచాయతీ తురకపల్లెకు చెందిన మహమ్మద్ రఫీ (42) తాటికాయలు కోయడానికి చెట్టు ఎక్కి ఈ నెల 16న కిందపడ్డాడు. తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి చెన్నై ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పెద్దమండ్యం పోలీసులకు సమాచారం అందింది. పెద్దమండ్యం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa