సున్నా వడ్డీ లబ్ధిదారులని ఉద్దేశించి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మహిళల ఆర్థిక స్వావాలంబన, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అలాగే ఈ సున్నా వడ్డీ పథకం కూడా మహిళలు ఆర్థికంగా బలపడెందుకు దోహధపడుతుందని మహిళల కోసం ఇంతగా ఆలోచిస్తున్న జగన్మోహనరెడ్డికి మనమందరం అండగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టూరిజం శాఖా మంత్రి ఆర్. కె రోజా తో కలిసి డిప్యూటీ సియం నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద రావు, మేయర్ శిరీషా, తిరుపతి కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి మరియు సున్నా వడ్డీ లబ్ధిదారులు పాల్గొన్నారు.