అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కె. వి. ఉష శ్రీ చరణ్, శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఏడిసిసి బ్యాంకు చైర్మన్ లిఖిత, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, డిఆర్డీఏ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి విజయలక్ష్మి, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడవ విడతలో 42, 549 మంది స్వయం సహాయక సంఘాలకు రూ. 69. 31 కోట్లు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పేర్కొన్నారు.
జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడవ విడతలో 42, 549 మంది స్వయం సహాయక సంఘాలకు రూ. 69. 31 కోట్లు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి పేర్కొన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని 32, 441 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 3, 40, 530 మంది మహిళల ఖాతాల్లో రూ. 53. 82 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 10, 108 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 1, 01, 653 మంది మహిళల ఖాతాల్లో రూ. 15. 49 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 2019-20వ సంవత్సరంలో ఒకటవ విడతలో భాగంగా జిల్లాలో 34, 882 మంది స్వయం సహాయక సంఘాలకు రూ. 71. 32 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 2020-21వ సంవత్సరంలో రెండవ విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 40, 883 మంది స్వయం సహాయక సంఘాలకు రూ. 61. 76 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 2021 - 22 వ సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడవ విడతలో భాగంగా 42, 549 మంది స్వయం సహాయక సంఘాలకు రూ. 69. 31 కోట్లు జమ చేశామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంతో పాటు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత తదితర కార్యక్రమాల ద్వారా వారి స్వయం ఉపాధి పొందాలని, దాని ద్వారా మరి కొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మహిళల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడవ విడతలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మెగా చెక్ ను మంత్రి, జిల్లా కలెక్టర్ అందజేయడం జరిగింది.