హిందులు కలియుగ దైవంగా, ఆపద మొక్కులుగా కొలిచే పవిత్ర తిరుమల కొండపై తాజాగా ఓ తప్పిదం చోటు చేసుకుంది. గోవింద నామ స్మరణతో కలకలలాడే పవిత్ర క్షేత్రంలో సినిమా పాటలు చూసి భక్తులంతా అవాక్కయ్యారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కొండపై ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్లపై భక్తి పాటలు, అన్నమయ్య గీతాలు ప్రసారం చేయాల్సి ఉంది.
అయితే సాయంత్రం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు ఏకధాటిగా హుషారెత్తించే సినిమా పాటలు వేశారు. ఇవి చూసిన శ్రీవారి భక్తులు నొచ్చుకున్నారు. పవిత్ర కొండపై అధికారులు ఇలాంటి పనులు చేయడమేంటని పలువురు భక్తులు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఓ పక్క సినిమా పాటలు, దాని వెనుక భక్తుల గోవింద నామ స్మరణలు వినిపించడంతో అక్కడ ఉన్న భక్తులు విస్మయానికి గురయ్యారు. టీటీడీ స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరారు.