ఐపీఎల్-2022లో నేడు ఆసక్తికర పోరు జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ కోల్పోయింది. ఇక టాస్ నెగ్గిన ఢిల్లీ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఆ జట్టులో జోస్ బట్లర్ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 116 పరుగులు (9 సిక్సులు, 9 ఫోర్లు)తో చెలరేగి ఆడాడు. అతడికి దేవదత్ పడిక్కల్ (54), కెప్టెన్ సంజు శాంసన్ (46*) సహకారం అందించారు. దీంతో ప్రత్యర్థికి గుబులు పుట్టించే లక్ష్యాన్ని రాజస్థాన్ ఉంచగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లకు చెరో వికెట్ దక్కింది.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఓబెడ్ మెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మెన్ పావెల్, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్