నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో అన్నే ప్రయోజనాలు ఏడుపు వలన ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనిషి అప్పుడప్పుడు ఏడిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ మేలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడుస్తున్నప్పుడు కన్నీరు వస్తుంది. అలా వచ్చే కన్నీరుతో కళ్ళల్లో ఉన్న దుమ్ము, మలినాలు బయటకు వెళ్లాయట. అంతేకాదు కంటినీరులో ఉండే ఐసోజైమ్ క్రిములు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఏడవడం వలన బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడటాన్ని తగ్గిస్తుంది.
ఎక్కువ సమయం ఏడ్చేవారిలో ఆక్సిటోసిన్, ఇండ్రాఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇది ఫీల్ గుడ్ రసాయనం కావడంతో శారీరక, మానసిక భావేద్వేగాల సంబంధించిన మార్పులు కలుగుతాయి. నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
ఏడుపు డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కన్నీరుతో శరీరంలోని విషతుల్యాలు బయటకుపోతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది.
కన్నీళ్లు కంటికి ఒక వ్యాయామంలా పనిచేస్తాయి.దీనివల్ల కళ్లు ప్రశాంతతను కలిగి ఉంటాయి.
ఏడుపు వల్ల ఎమోషనల్, ఫిజికల్ బాధలు తగ్గుతాయి.
ఎడవడం వలన మనసులోఉన్న బాధ తగ్గి మనస్సు తేలిక అవుతోంది.