విశాఖ జాబ్‌మేళాలో దాదాపు 25 వేల ఉద్యోగాలు రాబోతున్నాయని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ వి.విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో శని, ఆదివారాలు (23, 24 తేదీలు) నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై ఆంధ్రా యూనివర్సిటీ, వైవీఎస్ మూర్తి ఆడిటోరియమ్ సమీక్షించారు. విశాఖ జాబ్‌మేళాలో దాదాపు 25 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలియచేసారు. ఇందుకు గాను ఇప్పటికే 77 వేల ఉద్యోగార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. శని, ఆదివారాలు ఏయూలో జాబ్‌మేళా, అవసరం అయితే సోమవారం కూడా కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు తెలియచేసారు.