రాష్ట్రంలో అడుగడుగునా దౌర్జన్యం జరుగుతూనే ఉంది, పేద ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని నారా లోకేష్ అన్నారు. అలానే ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని .. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వైసిపి నేతలు కలిసి చేస్తున్న విధ్వంసం చూస్తుంటే బాధేస్తుంది. సిఎం ఉండే నియోజకవర్గంలో పేదలకు చోటు లేదంటూ ఒక పక్క ఇళ్లను కూల్చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మరో పక్క వారి అనుచరగణం పేదలకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. కాజా గ్రామంలో బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న మహిళ శివ కుమారిని వైసిపి నేతలు, అధికారులు వేధించడం అన్యాయం. సిఎం గారు ఆదేశించారు వెంటనే దుకాణం బంద్ చెయ్యాలని బెదిరించడమే కాకుండా ఏకంగా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి సామాన్లు తీసుకువెళ్లడం చూస్తుంటే.. ఇక ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రతికే పరిస్థితులు లేవని తేలిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు.