తిరుపతి జిల్లా ఏర్పేడు శివగిరిపల్లికి వెళ్లే దారి పక్కనున్న చెరువు సమీపంలో ఓ చిరుతపులి దాని పిల్లలు రెండు ఉండటాన్ని ఆదే గ్రామానికి చెందిన సందీప్ వర్మ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు కారం అందించడంతో శనివారం ఉదయం అధికారులు శివగిరిపల్లి చెరువు దగ్గర చిరుత పులి, రెండు పిల్లలు కాలి గుర్తులను గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుతను పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.