అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తన మానవతా గుణాన్ని మరోసారి చాటుకున్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సేవలు అందించి తన ద్విచక్ర వాహనంపై పంచాయతీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన పారిశుధ్య కార్మికురాలు వత్స ధనలక్ష్మి మోపేడ్ అదుపుతప్పి పడిపోయింది. వెంటనే ఆమె వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు తమ కార్యాలయ సిబ్బంది సహకారంతో ఆమెను పైకి లేపి సపర్యలు అందించారు.
ఆమె కాలికి గాయం కావటంతో సిబ్బందిని కేటాయించి ఆమెకు వైద్య చికిత్స అందించి ఇంటికి చేర్చారు. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులను గమనిస్తే వెంటనే స్పందించి వైద్య సహాయం అందించటం ద్వారా పలుమార్లు ఎమ్మెల్యే రమేష్ బాబు తన మానవతా ధృక్పధాన్ని చాటుకున్నారు.