రెండు ఆదివాసీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో 168 మంది చనిపోయారు. అరబ్బులు, అరబ్బుయేతర ఆదివాసీల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. సుడాన్ దేశంలోని పశ్చిమ దార్ ఫూర్ ప్రావిన్షియల్ రాజధాని జెనెనాకు తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఈ గొడవలు జరిగాయి. ఆదివారం రోజు ఈ హింస మరింత ముదిరింది. ఘటనలో 168 మంది దుర్మరణం చెందడం కలకలం రేపింది.
ఈ ఘర్షణలో మరో 98 మంది గాయాలపాలయ్యారు. దార్ ఫూర్ లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఓ సంస్థ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని తెలియజేశారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.