ఓ మగువు చూపిన ధైర్య సాహసాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కాలంలో మహిళలకు ఆత్మరక్షణ పోరాట విద్యలు ఎంతో అవసరమని సామాజికవేత్తలు చెబుతుంటారు. ఆ అవసరం ఏంటో ఈ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఓ రెస్టారెంటులో పనిచేస్తున్న మహిళపై కస్టమర్లు దాడి చేయగా, ఆమె బెదిరిపోకుండా వారికి తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని రుచి చూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇద్దరు కస్టమర్లలో మొదట ఓ వ్యక్తి ఆ వెయిట్రెస్ పై దాడి చేయగా, ఆమె అతడిని పంచ్ లు, లెగ్ కిక్ తో పడగొట్టింది. ఆపై మరో వ్యక్తి కూడా దూసుకురావడంతో అతడిని కూడా ఆమె సమర్థంగా ఎదుర్కొంది. అతడు ఓ కుర్చీ తీసుకుని ఆమెపైకి విసరగా, స్ట్రెయిట్ కిక్ తో బలంగా తన్నేసరికి అతడి పారిపోయాడు. కిందపడ్డ మరో వ్యక్తి తీవ్రమైన బాధతో దొర్లుతూ ఉండడం వీడియోలో కనిపించింది. ఏమైనా ఆ మగువ ధైర్యానికి నెటిజన్లు నీరాజనాలు అర్పిస్తున్నారు. లేడీ బ్రూస్ లీ అంటూ ప్రశంసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa