రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీ లను తగ్గించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం గుంతకల్లు మండల పరిధి లోని దోసలుడికి గ్రామంలో కొవ్వొత్తులు ప్రజలకు పంచి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు వెంకటేష్, మాజీ ఎంపీపీ రాయల్ రామయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి జింకల జగన్నాథ్, మాజీ ఎంపీటీసీ తలారి మస్తానప్ప, పార్లమెంట్ వాణిజ్య ఉపాధ్యక్షులు హనుమంతు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ పాల మల్లికార్జున, గోపాల్, మైనారిటీ నాయకులు ఫజులు, ఫ్రూట్ మస్తాన్, సిమెంట్ నారాయణ, సురేంద్ర, రఫీ, సుధాకర్, రంజాన్, కిరణ్, బాబు, ధనుంజయ, ఐటీడీపి చాంద్ బాషా, వెంకటేష్, సురేష్, సుబ్బయ్య, శివమూర్తి, ప్రభాకర్, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.