తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నుండి జగన్ ఎక్కువగా ప్రజలలోకి రావడానికి సంసిద్ధం అవుతున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మధ్య కాలంలో జిల్లాల పునుర్విభజన జరిగిన తరువాత , నరసరావుపేట , ఒంగోలు అలానే విజయవాడ ఇలా సీఎం జగన్ పర్యటనలు చేపడుతున్నారు. ఐతే తాజాగా విశాఖలో ఈ నెల 28న సీఎం వైయస్ జగన్ పర్యటన ఖరారైనట్లు అధికారికంగా ప్రకటించారు . జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చెయ్యడానికి వెళ్తున్నట్లు సమాచారం. విశాఖ నగర శివారులో మొత్తం 72 లేఅవుట్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఒకేచోట 300 ఎకరాల్లో 9 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది అని స్థానిక నేతలు , అధికారులు తెలియచేసారు.