ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించడమా జగన్ గారు? అని ప్రశ్నించారు టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ . వైసిపి నాయకుల పైశాచికత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏకంగా చిన్నారులను పోలీస్ స్టేషన్ లో పెట్టి వికృత ఆనందం పొందుతున్నారు. ఆడుకుంటూ వెళ్లి ఫ్లెక్సీ చింపారని విద్యార్థులను రోజంతా పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వేధించడం వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకి అద్దం పడుతోంది. బాలల హక్కులు కాలరాసే విధంగా చోటుచేసుకున్న ఈ ఘటన పై విచారణ జరిపి, విద్యార్థులను వేధించడానికి కారణమైన వైసీపీ నేతలు, వారికి సహకరించిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలి అని లోకేష్ డిమాండ్ చేసారు.