చిత్తూరు: సత్యవేడు మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. స్థానిక నేతల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా కొండలను పిండి చేస్తోంది. కొంత భూమికి అనుమతి తీసుకుని చుట్టుపక్కల ఉన్న వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటోంది.
సత్యవేడు మండలంలోని కన్నావరం పంచాయతీ తమిళనాడుకు కూతవేటు దూరంలో ఉంది. చెన్నైలో గ్రావెల్కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్ర మాఫియా ఈ ప్రాంతంపై కన్నువేసింది.