ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి మే 6 వరకు పరీక్షలు జరగనున్నాయి.ఈ ఏడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పదో పరీక్షలో విద్యార్థులు కేవలం 7 పేపర్లు మాత్రమే రాయనున్నారు.రోజువారీ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు ఏపీ వ్యాప్తంగా మొత్తం 6.22 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa