ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నర్సు చేతి నుంచి పడి పసికందు మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 11:57 AM

ఓ మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం కాగానే బిడ్డను ఎత్తుకున్న నర్సు ఏమరపాటుతో ఊహించని ప్రమాదం జరిగింది. ఆ బిడ్డ ఆమె చేతుల్లోంచి జారి కిందపడింది. దీంతో ఆ శిశువు అక్కడికక్కడే మరణించాడు. అలా పుట్టీపుట్టగానే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయాడు. ఇక పసికందు తల్లి గుండెలు బాదుకుని రోదించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చింతన్‌ ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ ప్రసవం కోసం రెండు రోజుల క్రితం చేరింది. మంగళవారం ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. వెంటనే ఆ శిశువును అక్కడ పని చేసే నర్సు చేతుల్లోకి తీసుకుంది. అయితే టవల్ సాయం లేకుండా నేరుగా చేతుల్లోకి తీసుకోవడంతో ఆ శిశువు జారి కిందపడింది. దీంతో ఆ పసికందు కిందపడగానే తలకు గాయమైంది. ఫలితంగా ఆ శిశువు ప్రాణాలు పోయాయి. ఈ దృశ్యం చూసిన ఆ శిశువు తల్లి బిగ్గరగా రోదించింది. అక్కడికి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పరుగుపరుగన వచ్చారు.


మృత శిశువు జన్మించిందని తొలుత ఆసుపత్రి సిబ్బంది బుకాయించారు. అయితే బిడ్డ తల్లి అసలు విషయం చెప్పడంతో అందరికీ జరిగిన సంగతి తెలిసింది. పోలీసులు అక్కడకు చేరుకుని, శిశువు మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. శిశువు తలకు గాయం కావడంతోనే మృతి చెందాడని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com