కర్నూలు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కర్నూలు జిల్లా డోన్ అమకతాడు టోల్ గేట్ వద్ద ఓ లారీ డ్రైవర్ ను సిబ్బంది టోల్ ఓవర్ ఆక్సిషిన్ ఫీజు అడిగారు. దీంతో డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. టోల్ సిబ్బంది శ్రీనివాస్ లారీని అడ్డుకునే క్రమంలో ఎదురెళ్లి వాహనం ఎక్కాడు. ఐనా డ్రైవర్ ఆపకుండా అలానే రోడ్డు మీద వాహనాన్ని తీసుకెళ్లాడు. సిబ్బంది వాహనాలు వేసుకొని వెంటపడ్డా కూడా డ్రైవర్ ఆపలేదు. 10 కిలోమీటర్ల వరకు డ్రైవర్ అలాగే పోనిచ్చాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని వెంబడించి ఆపి అతని ప్రాణాన్ని కాపాడారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.