కుప్పంలో స్థానిక సంస్థలన్నీ గెలిచామని, ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా విజయం సాధిస్తారని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. మే నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నామని, అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ.. మనం ఒదిగి ఉండి, చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని సూచించారు. సర్వేలో గెలవరని తేలితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని తేల్చి చెప్పారు.