యుద్ధం చంద్రబాబుతోనే కాదు, ఎల్లో మీడియాతోనూ అని సీఎం జగన్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చెప్పారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుందని, ఆ లోగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎలాంటి విభేదాలున్నా పక్కనబెట్టి, కలిసికట్టుగా పనిచేయాలన్నారు.