అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో మలేరియా వర్కర్ గా పని చేస్తున్న గోపి బైక్ పై వెళ్తుండగా తెలంగాణ ఆర్టిసి బస్సు ఢీకొనడంతో కుడికాలు దెబ్బతింది. సమాచారం తెలిసిన వెంటనే మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు గాయపడిన గోపిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. విరిగిన కుడికాలుకు ఆపరేషన్ నిర్వహించి స్టీల్ రాడ్ వేస్తున్నట్లు కార్మిక సంఘం నాయకులు నాగరాజు తెలిపారు.