ఆంధ్రప్రదేశ్ లో రైతులు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రైతులు, కౌలు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతు కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.