జిల్లా సరిహద్దు కైకలూరు ప్రాంతము కొల్లేరు సరస్సు నాటు సారా తయారీ కేంద్రాలపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు స్వయముగా నాటు పడవలో ప్రయాణము చేసి క్షేత్రస్థాయిలో దాడులను చేశారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కె చక్రవర్తి , కైకలూరు సీఐ వై వి వి నాయుడు , కైకలూరు రూరల్ ఎస్ఐ చల్ల కృష్ణ ముదినేపల్లి ఎస్ఐ రవి చంద్ర కుమార్, మండవల్లి ఎస్ఐ ఎస్. ఇ.బి ఇన్స్పెక్టర్ ఎస్.రాంబాబు ,ఎస్ఐ జమలుద్దిన్ కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శృంగవరు పాడు గ్రామంలో ప్రాంతాలలో దాడులను నిర్వహించగానాటు సారా కి తయారీకి ఉపయోగించే 22 ప్లాస్టిక్ డ్రమ్ముల లో ఉంచిన 4,000 లీటర్ బెల్లం ఊట ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినారు.
ఈ దాడులలో 4 గురు వ్యక్తిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 500 లీటర్ల నాటు సారాయి ను, 04 గ్యాస్ సిలిండర్ లు,04 గ్యాస్ స్టౌవ్ లు, 12 అల్యూమినియం పాత్రలు స్వాధీనం చేసుకొని కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినారు.