ఏపీలో రైతులు దయనీయ స్థితిలో బతుకుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేయడం జరిగింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ కూడా రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలిపారు. రైతు కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.