కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అమానుషకరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కుమార్తెను శారీరకంగా అనుభవించి తల్లిని చేసిన ప్రబుద్ధుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్న కోమటి సురేశ్ చిలకలపూడికి చెందిన ఓ వివాహిత మహిళతో సహజీవనం చేస్తూ 17 యేళ్ల ఆమె కుమార్తెను పది నెలలుగా శారీరకంగా అనుభవించటంతో ఆ బాలిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.