ఏపీలో విద్యుత్, రహదారుల పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టిడిపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమర్ధించారు. శనివారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులు అంగీకరించకుండా కొందరు మంత్రులు కేటీఆర్ విరుచుకుపడడం సమంజసంగా లేదన్నారు. రాష్ట్రంలో రహదారులు పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.