ఎన్నడూ చూడని ఎండలు ఈ ఏడాదిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు చవిచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వడగాలుల ప్రభావమూ అధికంగా ఉండడంతో తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేడు 44 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మరోవైపు, తెలంగాణలో నిన్న వడగాలులు, వడదెబ్బ వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్‌లో నిన్న రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.