ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజువారి కూలి 600 ఇవ్వాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమంతునిపాడు మండలం హాజీపురం గ్రామంలో ఉపాధి కూలీలు పే కార్డ్స్ ప్రదర్శించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉపాధి కూలీలకు రోజువారి కూలి 600 ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, మేట్ లు పాల్గొన్నారు.