పులివెందులలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలో ఇళ్ల పనులు వేగవంతం కావాలని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డితో కలసి జగనన్న కాలనీలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్లానింగ్ ప్రకారమే ఇళ్ల నిర్మాణాలు జరగాలని అధికారులకు సూచించారు. కాలనీ నిర్మాణ దశలో ఉన్న కారణంలో అక్కడ పరికరాలు దొంగతనం కాకుండా అవసరమైన ప్రతిచోట వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ గురప్పయాదవ్, ప్లానింగ్ అధికారి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.