మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కంచరపాలెం ఎస్ఐ లోకేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు కంచరపాలెం పారిశ్రామిక శిక్షణా కేంద్రంల మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలు వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కంచరపాలెం లా అండ్ ఆర్డర్ సీఐ కృష్ణారావు నేతృత్వంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఐ లోకేశ్వరరావు మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాల బారినపడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా యువత ధూమపానం మద్యపానం గంజాయి కి దూరంగా ఉండాలని సూచించారు. చదువుకునే వయస్సులో యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తమ భవిష్యత్తు ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగే తరుణంలో మత్తుపదార్థాలకు దూరంగా ఉండి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు తమ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.