మనకు తెలిసిన మానవజన్మకంటే ఇంకో జీవి ఉంది. అదే గ్రహాంతర వాసులు. వారిపై మన శాస్త్రవేతలు పరిశోధనలు చేస్తున్నారు. భూమి ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని TRAPPIST-1 నక్షత్ర మండలంలోని గ్రహాంతర జీవుల (Aliens) దృష్టికి తీసుకువెళ్లేందుకు రూపొందించిన రేడియో సిగ్నల్ వ్యవస్థ మెసేజ్‌ను ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభించనున్నారు. మెటీ ఇంటర్నేషనల్ ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, చరిత్రకారులు, మానవశాస్త్ర పరిశోధకులు, కళాకారుల బృందం సంయుక్తంగా ఈ సందేశాన్ని రూపొందించడం విశేషం. గ్రహాంతరవాసుల నుంచి సమాధానం కోసం వేచి చూడకుండా నక్షత్రాలకు సందేశాన్ని అందించడం ద్వారా మానవులకు ప్రయోజనం కలుగుతుందనే సాధారణ నమ్మకంతో వీరంతా కలిసి పనిచేశారు.
గ్రహాంతర వాసులపై పరిశోధనకు నిర్దేశించిన సెర్చ్ ఫర్ ఎక్సట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ( SETI)కి ప్రత్యామ్నాయంగా మెసేజింగ్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ (METI)ని రూపొందించారు. దీనిని ఈ ఏడాది అక్టోబరు 4న యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కార్నవాల్లో గూన్‌హిల్లీ శాటిలైట్ ఎర్త్ స్టేషన్ నుంచి ప్రసారం చేయనున్నారు. యాదృశ్చికంగా వరల్డ్ స్పేస్ వీక్ అదే రోజున ప్రారంభం కానుంది. ‘అంతరిక్షం.. స్థిరత్వం’ అనే థీమ్‌తో స్పేస్ వీక్‌ను ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.
‘‘మా సందేశాన్ని స్వీకరించే ఏ గ్రహాంతర వాసులైనా భూమిపై వాతావరణ సంక్షోభం గురించి విని ఆశ్చర్యపోరు.. దశాబ్దాలుగా మన దుస్థితిని దూరం నుంచి వారు గమనించే పనిలో ఉన్నారు’’ అని మెటి ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డగ్లస్ వకోచ్ వ్యాఖ్యానించారు. గ్రహాంతరవాసులకు మన గురించి ఇప్పటికే తెలిసినా లేదా తెలియకపోయినా.. వారితో విజయవంతంగా కమ్యూనికేట్ చేయడం కష్టం.. గ్రహాంతర జీవులకు మన భాషలు తెలియవు లేదా మన సంస్కృతిని అర్థం చేసుకోలేరు. వారి చుట్టూ ఉన్న విశ్వాన్ని మనకంటే భిన్నంగా అర్థం చేసుకోవచ్చు.
‘నక్షత్రాల మధ్య సమాచార మార్పిడిలో పెద్ద సవాల్ ఏమిటంటే అర్థం చేసుకోవడానికి ఒక ఉమ్మడి వేదికను ఏర్పరచడం’ అని వకోచ్ చెప్పారు. దీనిని పరిష్కరించడానికి మా సందేశం మూలకాల ఆవర్తన పట్టికతో ప్రారంభమవుతుంది. రసాయన మూలకాలు సార్వత్రికమైనవి కాబట్టి శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న ఏ గ్రహాంతరవాసులైనా ఆవర్తనాన్ని గుర్తించాలనేది METI ఇంటర్నేషనల్ వాదన. భూమిపై మనం ఎదుర్కొంటున్న కొన్ని పర్యావరణ సవాళ్లను వివరించడానికి ఆ కంటెంట్ సందేశం కోసం సాధారణ వేదికను సృష్టిస్తుంది.
‘TRAPPIST-1 నక్షత్ర వ్యవస్థ భూమికి 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.. కాబట్టి అక్కడ ఎవరైనా మనం పంపే సందేశాన్ని గుర్తించినట్టయితే కనీసం 78 ఏళ్ల వరకు అటువైపు నుంచి జవాబును ఆశించకూడదు. ఏది ఏమైనప్పటికీ అనంత విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడింది.. ఈ సీన్‌లో మనం కొత్తవాళ్లమే కాబట్టి సాంకేతికంగా అభివృద్ధి చెందిన గ్రహాంతర జీవులు మన కంటే చాలా పురాతనమైనవి కావచ్చు’ అని అన్నారు.
వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మానవులకు కాలం మధ్య ఉన్న అంతరం ఏదైనా సహాయం అందించగలదని ఆథర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక గ్రహాంతర జాతి బహుశా మిలియన్ల లేదా బిలియన్ల సంవత్సరాలు జీవించగలిగితే ఇటువంటి సంక్షోభాన్ని పరిష్కరించడంలో చాలా కాలం కిందటే నైపుణ్యం కలిగి ఉంటారని భావిస్తున్నారు. అలాంటి గ్రహాంతరవాసుల నుంచి వచ్చే సమాచారం వల్ల మన వాతావరణ సమస్యలను మనమే పరిష్కరించుకోగలమన్న విశ్వాసం కలుగుతుంది.
‘‘భవిష్యత్తు గురించి అనిశ్చితి ఉన్న ఒక జాతి ఆలోచనలపై గ్రహాంతరవాసులకు అంతర్దృష్టిని అందించడం ద్వారా అది ఇప్పటికీ చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.. మేము చాలా కాలం నుంచి అటువంటి అస్థిరత, అనిశ్చితిని విడిచిపెట్టిన నాగరికతకు ప్రత్యేకమైన అంతర్దృష్టులను అందిస్తాం.. మా నిష్కపటమైన ప్రయత్నానికి వారి నుంచి ప్రతిస్పందనను ఆశించడం చమత్కారంగా ఉండొచ్చు’’ అని వకోచ్ అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa