ఈనెల 8న కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కౌలు రైతు భరోసా యాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. శిరివెళ్లలో రచ్చబండ నిర్వహించి ఆత్మహత్య చేసుకున్న 130 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గత మూడేళ్లలో 373 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.