ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా మాజీ ప్లేయర్ రెండో పెళ్లి

national |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 11:47 AM

66 ఏళ్ల వయసులో టీమిండియా  మాజీ ప్లేయర్ అరుణ్ లాల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కోల్ కతా వేదికగా మే 2న కూతురు వయసు ఉండే బుల్ బుల్ సాహాతో అరుణ్ లాల్ రెండో పెళ్లి చేసుకున్నాడు.బుల్ బుల్ సాహా  వయసు 38 ఏళ్లు కావడం విశేషం. దాంతో వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. . కోల్ కతా  లోని పీర్లెస్ ఇన్ లో మే 2వ తేది సాయంత్రం 7 గంటలకు వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి వివాహం క్రికెట్ సర్కిల్ లో సంచలనంగా మారింది.అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా పనిచేస్తున్నారు. అరుణ్ లాల్ మొదటి భార్య దేబ్జనీ లాల్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెను ఒప్పించి మరీ అరుణ్ లాల్ రెండో పెళ్లిని చేసుకున్నట్లు సమాచారం. అయితే అరుణ్ లాల్ మొదటి భార్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దాంతో అరుణ్ లాల్ ఆమెకు ఇది వరకే విడాకులు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆమె ఆనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అరుణ్ లాల్ వద్దే ఆమె ఉంటున్నారు. అరుణ్ లాల్ మొదటి భార్యకు బుల్ బుల్ సాహాతో మంచి సంబంధాలే ఉన్నట్లు సమాచారం.అరుణ్‌ లాల్‌ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 13 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 729 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో122 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ లో అరుణ్ లాల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితేఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం మెరుగ్గా ఆడాడు. 156 మ్యాచ్‌ల్లో 30 శతకాలు, 43 అర్ధ శతకాలతో 10,424 పరుగులు చేశాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్ గా కోచ్ గా అతడు స్థిరపడ్డాడు. అయితే కొందరు వీరి పెళ్లిపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అంత ఏజ్ గ్యాప్ ఉన్న మహిళతో పెళ్లి ఏంటంటూ అరుణ్ లాల్ ను ఏకిపారేస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com