ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో దారుణం.. వ్యక్తి మర్మాంగం కోసిన యువతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 12:10 PM

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి దారుణం జరిగింది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి మర్మాంగాన్ని ఓ యువతి కోసేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతడికి ఐతానగర్‌ కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. సోమవారం రాత్రి సదరు మహిళతో కలిసి రామచంద్రారెడ్డి మద్యం సేవించాడు. అనంతరం ఆమె నివాసముండే భవనంపై నిద్రించడానికి వెళ్లాడు. అయితే తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆగ్రహంతో ఉన్న సదరు మహిళ కుమార్తె తన ప్రియుడితో కలిసి రామచంద్రారెడ్డితో గొడవ పడింది. 


ఈ క్రమంలో తన ప్రియుడి సహకారంతో రామచంద్రారెడ్డి మర్మాంగాలను బ్లేడుతో కోసేసింది. బాధితుడి కేకలు విన్న స్థానికులు అతడిని వెంటనే తెనాలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తెనాలి టూటౌన్‌ సీఐ కోటేశ్వరరావు ఆస్పత్రికి వచ్చి బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com