యూపీలోని కాస్ గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బోలేరో వాహనం ఢీకొన్న ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాటియాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కయామ్ గంజ్ రోడ్డు ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నా సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళలే ఎక్కువ మంది చనిపోయారు. ఈ ప్రమాదం పై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.